Zoo Park | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నెహ్రూ జులాజికల్ పార్క్‌ను షాద్‌నగర్‌కు తరలిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్త వం లేదని తెలంగాణ వైల్డ్‌లైఫ్ చీఫ్ పీసీసీఎఫ్ మోహన్ పర్గేన్ స్పష్టంచేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ’షాద్‌నగర్‌కు జూపార్క్ తరలింపు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై పీసీసీఎఫ్ స్పందించారు. జూపార్క్ తరలింపు ప్రక్రియ అంత సులువుగా జరిగేది కాదని పే ర్కొన్నారు. నూతన స్థల ప్రతిపాదనల అనుమతులు, నిర్ణయాలు సెంట్రల్ జూ అథారిటీ ఢిల్లీ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 1963లో స్థాపించిన జూపార్క్ ఇటీవలే 60 ఏండ్లు పూర్తి చేసుకున్నదని, ఇప్పటివరకు 60 లక్షల మంది సందర్శకులకు ఆహ్లా దం పంచిన ఈ పార్క్‌ను తరలించాలనే ప్రతిపాదన అటవీశాఖకు లేదని స్పష్టంచేశారు.