Smoking | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బహిరంగ నిర్లక్ష్యంగా ధూమపానం చేయడం వల్ల అగ్నిప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఆరేండ్లలో జరిగిన మొత్తం అగ్నిప్రమాదాల్లో 49% ‘కేర్లెస్ స్మోకింగ్’ వల్ల, 31% విద్యుత్తు ఉపకరణాలు, షార్ట్సర్క్యూట్ల వల్ల, 4% గ్యాస్/బొగ్గు వల్ల, 16% ఇతర కారణాల వల్ల సంభవించినట్టు స్పష్టమవుతున్నది. కేర్లెస్ స్మోకింగ్ వల్ల సంభవించిన ప్రమాదాల్లో 36% బహిరంగ ప్రదేశాల్లో, 36% ఇండ్లలో, 18% వ్యవసాయ క్షేత్రాల్లో, 10% ఇతర ప్రాంతాల్లో జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాల నివారణకు ఇండ్లతోపాటు పరిశ్రమలు, స్టోరేజీ గోడౌన్లు, దుకాణాలు, అవుట్డోర్ స్రాప్ యార్డుల్లో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర అగ్నిమాపక శాఖ సూచిస్తున్నది. ముఖ్యంగా ధూమపాన ప్రియులు సిగరెట్, బీడీ, చుట్ట కాల్చిన తర్వాత వాటిని పూర్తిగా ఆర్పివేయాలని కోరుతున్నది. ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే 101 నంబర్‌కు కాల్ చేయాలని అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు.
పాటించాల్సిన జాగ్రత్తలు..