రామవరం, డిసెంబర్ 5 : రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారుడు మోరె భాస్కర్రావు పాత్ర మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో భాస్కర్ మరణవార్త తెలుసుకున్న ఆయన ఢిల్లీ నుంచి గురువారం నేరుగా చేరుకున్నారు. ఆయనతోపాటు బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, దిండిగల రాజేందర్భాస్కర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఎంపీ వద్దిరాజు ఫోన్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్, కవిత భా స్కర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్పాషా, కోనేరు సత్యనారాయణ, రంగాకిరణ్ పాల్గొన్నారు.