సంతాన సాఫల్య అణువు

ఐవీఎఫ్ సక్సెస్ రేటును పెంచే ఎంపీటీఎక్స్
ఐఐటీ హైదరాబాద్ పరిశోధకుల ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పిల్లలు పుట్టక సంతానం కోసం వైద్యులచుట్టూ తిరిగే దంపతులకు ఐఐటీ హైదరాబాద్ శుభవార్త చెప్పింది. సంతానోత్పత్తిలో అత్యంత కీలకమైన మాలిక్యూల్‌ను ఐఐటీహెచ్‌లో అభివృద్ధిచేశారు. కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల సంయుక్త పరిశోధనతో ఐవీఎఫ్ చికిత్సలో సమర్థంగా ఉపయోగపడే ఎంపీటీఎక్స్ మాలిక్యూల్‌ను రూపొందించారు. ఐఐటీహెచ్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ రాజకుమార ఈరప్ప, మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జగదీశ్ ప్రసాద్ దాసప్ప, మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజ్‌లోని ఫ్రొపెసర్ గురుప్రసాద్ కల్తూర్ బృందం దీనిని ఆవిష్కరించింది. వీర్యం (స్పెర్మ్) సామర్థ్యాన్ని ఈ ఎంపీటీఎక్స్ అనే మాలిక్యూల్ మెరుగుపరుస్తుందని ప్రాథమిక పరిశోధనలో తేలింది. వీర్యంలోని కణాలు బలహీనంగా ఉండి ఎక్కువ కదలికలు లేనప్పుడు ఎంపీటీఎక్స్ను వాడితే మెరుగైన ఫలితాలు వచ్చాయి. అండం ఫలదీకరణ చెంది గర్భాశయంలో పిండం ఏర్పడటానికి ఇది దోహదం చేసింది. సంతానలేమితో బాధపడుతున్నవారికి ఇది వరంలా మారుతుందని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- fertility
- IIT Hyderabad
- IVF
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

