NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
NZvIND: వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వచ్చేశాడు. గాయపడ్డ ఇషాన్ కిషన్ స్థానంలో అతనికి చోటు కల్పించారు. కివీస్‌తో జరగనున్న రెండో టీ20లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ప్రిన్స్ యాదవ్ కూడా జట్టులోకి వచ్చేశాడు. కివీస్ జట్టులో డఫీ చేరాడు.
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్(NZvIND)లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. తొలి మ్యాచ్ జరిగిన క్రైస్ట్చర్చ్లోనే రెండో టీ20 కూడా జరుగుతోంది. అనుకున్నట్లే ఈ మ్యాచ్‌లో సూర్యవంశీకి చోటు దక్కింది. యువ డాషింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంవీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని కెప్టెన్ అయ్యర్ తెలిపారు. తేమ కారణంగా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు చెప్పారు. గాయపడ్డ ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యవంశీని తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రిన్స్‌కు కూడా చోటు దక్కింది. మయాంక్ స్థానంలో అతన్ని తీసుకున్నారు.
#TeamIndia opt to bowl first in the 2️⃣nd T20I
Vaibhav Sooryavanshi & Prince Yadav back in the XI 📝
Updates ▶️ https://t.co/FZtUFIFWS2
#NZvIND https://t.co/VCof26ERFg
— BCCI (@BCCI) October 24, 2026
300వ టీ20 మ్యాచ్
టీమిండియా జట్టు 300వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటి వరకు టీ20ల్లో ఇండియా 205 మ్యాచుల్లో నెగ్గింది. 83 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఇక ఓ మ్యాచ్ టైగా ముగిసింది. 300 టీ20లు ఆడిన రెండవ జట్టుగా ఇండియా నిలిచింది. భారత్ కన్నా పాకిస్థాన్ ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆ జట్టు 304 మ్యాచ్‌లు ఆడినట్లు రికార్డులు చెబుతున్నాయి. తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. భారీ స్కోరు మ్యాచ్‌ను గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
#TeamIndia opt to bowl first in the 2️⃣nd T20I
Vaibhav Sooryavanshi & Prince Yadav back in the XI 📝
Updates ▶️ https://t.co/FZtUFIFWS2
#NZvIND https://t.co/VCof26ERFg
— BCCI (@BCCI) October 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

