హైదరాబద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సినీ నటుడు మోహన్బా బు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే నిరాకరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ సుధాన్ష్ ధులి యా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.