హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): హిట్ అంట్ రన్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ కుమారుడు మహమ్మద్ రాహిల్ అమీర్‌కు చుక్కెదురైంది. 2022లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో రాహిల్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంగళవారం హైకోర్టుకు తెలిపారు. ఆర్థికంగా బలవంతుడైన రాహిల్‌కు రాజకీయ పలుకుబడి కూడా ఉన్నదని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని వివరించారు. ఈ వాదనలతో జస్టిస్ తుకారాంజీ ఏకీభవిస్తూ.. నిందితుడి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.