పేదోళ్ల గృహలక్ష్మి
పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే విషయంలో కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నప్పటికీ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తున్నది.
- సొంతింటి కలను సాకారం చేస్తున్న తెలంగాణ
- సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల సాయం
- డబుల్ బెడ్రూం ఇండ్లకు 11,638 కోట్లు వ్యయం
- నిధుల విడుదలలో వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రం
- లేనిపోని కొర్రీలు పెట్టి.. తన వాటాకు ఎగనామం
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే విషయంలో కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నప్పటికీ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను వెచ్చిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన గృహ నిర్మాణాల్లో కేంద్రం ఇచ్చిన నిధులు అరకొరగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే భారీ ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నది. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదన్నరేండ్లలో 2.92 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 1.38 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. 45,000 గృహాలను ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

కొర్రీలు పెట్టి నిధులు ఇవ్వని కేంద్రం
డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,638 కోట్లు వెచ్చించింది. కేంద్రం తన వాటా కింద ఇప్పటివరకు రూ.1,311 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా కేంద్రం నుంచి గ్రామీణ గృహాల కోసం రూ.381 కోట్లు, పట్టణ గృహాల కోసం రూ.2,390 కోట్లు రావాల్సి ఉండగా రకరకాల కొర్రీలతో వాటిని విడుదల చేయడం లేదు. మరోవైపు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం కేంద్రం హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో ఇండ్ల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నది. సొంతంగా ఇండ్లు నిర్మించుకునేవారికి, ఇల్లు కొనుక్కొనేవారికి పీఎం ఆవాస్ యోజన పథకం కింద కొంత రాయితీ అందించే పథకాన్ని అమలు చేస్తున్నది. అయినా మన రాష్ర్టానికి ఇవేవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవ్వడం లేదు.

కేంద్రం వివక్షకు నిదర్శనం
ఇల్లు లేనివారందరికీ ఇండ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పుకొంటున్న కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించిందనడానికి ఇప్పటివరకు విడుదల చేసిన నిధులే నిదర్శనం. రాష్ట్రంలో 2021-22 నాటికే ఆరు లక్షలకుపైగా ఇండ్లు నిర్మించాల్సి ఉండగా, అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయలేదు. పేదలకు ఇండ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు 80 శాతానికిపైగా వెచ్చిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి రూ.70 వేలు, పట్టణాల్లో రూ.1.5 లక్షల చొప్పున కేంద్ర పథకాల ద్వారా రావాల్సి ఉండగా వాటిని కూడా విడుదల చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్నవారికి రూ.మూడు లక్షలు గ్రాంటుగా ఇవ్వనున్నది. ఇందుకోసం గృహలక్ష్మి పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద నాలుగు లక్షల ఇండ్లకు సహాయం చేయాలన్నది లక్ష్యం.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

