హైదరాబాద్; నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా శుక్రవారం ఆ రాష్ట్ర సీపీఐ, సీపీఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. ‘మోదీ గో బ్యాక్’ అంటూ ఆందోళన చేపట్టారు.
నల్లదుస్తులు ధరించి మోదీకి వ్యతిరేకంగా నినదించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.