హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే నర్సులకు ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలని 97.7శాతం మంది నర్సులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ నర్సుల అసోసియేషన్(టీఎన్ఏ) ఆధ్వర్యంలో ఆన్లైన్ సర్వే నిర్వహించారు. ఈ ఆన్లైన్ సర్వేలో 2,637 మంది నర్సింగ్ ఆఫీసర్లు పాల్గొనగా.. 2,576 మంది ఆధునిక స్క్రబ్ యూనిఫామ్ అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.
అకడమిక్ డీఎంఈగా రమాదేవి
అకడమిక్ డీఎంఈగా ఎం రమాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టీనా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ప్రభుత్వం అకడమిక్ డీఎంఈగా నియమించింది.