వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి;మనిషి జీవనయానం ఎలా సాగినా కానీ.. చనిపోయిన తర్వాత సాగే చివరి మజిలీ మాత్రం గౌరవప్రదంగా ఉండాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా వైకుంఠ ధామాలను నిర్మిస్తున్నది. అదే బాటలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్మితమవుతున్న మాడల్ వైకుంఠధామం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొక్కలు, శివుడి భారీ విగ్రహం పనులు జరుగుతున్నాయి. రెండున్నర ఎకరాల్లో సకల సదుపాయాలు ఉండేలా రూ.3 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు.