హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్య, ఐటీ ఉద్యోగాల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలకు వీసా నిబంధనలు సడలించాలని ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు అ మెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కోరారు. వివిధ దేశాల పార్లమెంట్ల పనితీరు అధ్యయనంలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వర్జీనియా ప్రతినిధులు సుహాస్ సుబ్రహ్మణ్యం, జేమ్స్ వాకిన్షాతో బుధవా రం భేటీ అయ్యారు. అమెరికా చట్టసభల పనితీరు, ప్రజాసమస్యల పరిషార విధానాల గురించి ఎమ్మెల్సీ అడిగి తెలుసుకున్నారు.
అమెరికాలో దాదాపు 12లక్షల మంది తెలుగువారు నివసిస్తుండగా, అందులో సు మారు 6 లక్షల మంది తెలంగాణకు చెందినవారేనని పేరొన్నారు. ము ఖ్యంగా టూరిస్టు, ఇతర వీసా ప్రక్రియల్లో వారి కుటుంబాలు ఎదురొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ ప్రవాసుల ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అన్నిరకాల వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని, లక్ష డాలర్ల ఫీజు చెల్లింపు అంశంలో ఊరట కల్పించేలా పార్లమెంటులో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతినిధులు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.