హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో మంగళవారం బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా ఉతంఠ నెలకొన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు బడ్జెట్‌పై తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా.. మధ్యలోనే మైక్ కట్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఓర్చుకోలేకనే తన గొంతు నొకే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బడ్జెట్ ప్రతిపాదనలపై రవీందర్రావు విశ్లేషిస్తూ.. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మధ్యలోనే చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మైక్ కట్ చేయడంతో సభ లో కొంతసేపు గందరగోళం చోటుచేసుకున్నది. ప్రజాప్రతినిధిగా తన అభిప్రాయాలను చెప్పే కనీస అవకాశం ఇవ్వకపోవ డం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన సభలోనే నిరసన వ్యక్తం చేశా రు. సభ అనంతరం మీడియా పాయింట్ వద్ద రవీందర్రావు మాట్లాడుతూ.. బడ్జెట్లో కేటాయింపులు భారీగా ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలుకు నోచడం లేదని పేర్కొన్నారు.