MLC Shambhipur Raju | అసెంబ్లీ, శాసన మండలిలో బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్స్, మైక్ ఇవ్వక పోవడం వంటి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతున్నది. ఈ క్రమంలో చట్ట సభల్లో ప్రజల తరఫున తమ వాయిస్‌ను బలంగా వినిపించేందుకు బీర్ఎస్ ప్రజాప్రతినిధులు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా శాసనమండలిలో తమ నిరసనను కెమెరాలో చూపించడం లేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్న ఆలోచన చేశారు.
ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) మాట్లాడేటప్పుడు పక్కన కూర్చొని, జేబులో ఉన్న పేపర్‌ను చూపిస్తూ బామ్మర్దికి అమృత్ టెండర్లు.. తమ్ముడికి రావిర్యాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ అంటూ నిరసన తెలిపారు. గమనించిన మండలి సిబ్బంది వెంటనే కెమెరా తిప్పేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు సస్పెన్షన్ గురైన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సోదరుడు కొండా రెడ్డి అక్రమాలను ప్రజలకు చూయించేందుకు ఫోర్త్ సిటీకి బయలుదేరి వెళ్లారు.
శాసనమండలిలో తమ నిరసనను కెమెరాలో చూపించడం లేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వినూత్న ఆలోచన
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ మాట్లాడేటప్పుడు పక్కన కూర్చొని, జేబులో ఉన్న పేపర్‌ను చూపిస్తూ బామ్మర్దికి అమృత్ టెండర్లు.. తమ్ముడికి రావిర్యాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ అంటూ నిరసన… pic.twitter.com/X2esXpw4c4
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026