హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసుల్లో కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండటంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది. అయితే కవితను కోర్టులో భౌతికంగా హాజరుపరుస్తారా? లేక వర్చువల్గా హాజరుపరుస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై అధికారులు సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం విదితమే.