Maganti Gopinath | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతిపట్ల మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మృతి పట్ల మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గోపీనాథ్ అనారోగ్యంతో మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకు సాగాలని.. వారికి భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకున్నారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.
కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గోపీనాథ్.. ఎమ్మెల్యేగా ఎదిగారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జూబ్లీహీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి సంతాపా తెలిపారు. మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా నిలిచారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోఖార్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోఖార్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం… pic.twitter.com/rK77pMRF4F
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 8, 2025
మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన గోపినాథ్ మరణ వార్త తెలుసుకొని ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హఠాన్మరణం పట్ల సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహచర ఎమ్మెల్యే మరణం బాధ కలిగించిందన్నారు. ఆయనతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ మధ్యకాలంలోనే ఇంటికి రావాలని కూడా ఆహ్వానించారని గుర్తుచేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి విద్యార్థి యువజన నాయకుడుగా అంచలంచలుగా ఎదిగినారన్నారు. మూడుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనారని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతిపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.