పేదింటి చెస్ క్రీడాకారులకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సాయం
చెస్ క్రీడాకారులకు ఆర్థిక సాయం | అంతర్జాతీయ చెస్ పోటీలకు నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత గొప్ప మనసును చాటుకున్నారు.

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ చెస్ పోటీలకు నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత గొప్ప మనసును చాటుకున్నారు. జిల్లాకు చెందిన నర్సింగరావుకు ఇద్దరు కుమార్తెలు హర్షిత, రిషితలు చెస్ క్రీడాకారిణిలు. నిజామాబాద్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న వీరిద్దరూ అనేక చెస్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.
త్వరలో నేపాల్‌లో జరిగే ఇండో- నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు రిషిత, హర్షిత ఎంపికయ్యారు. ఖాట్మాండ్ లో ఈ నెల 14,15 న చెస్ పోటీలు జరగనున్నాయి. అయితే నర్సింగరావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని పలువురు, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం నిజామాబాద్ లో పర్యటించిన ఎమ్మెల్సీ హర్షిత, రిషితలను అభినందించారు.
అంతేకాదు టోర్నమెంట్లో పాల్గొనేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశారు.వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు నర్సింగరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్‌లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్‌ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

