జగిత్యాల, జూలై 9: ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించే వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖను పంపారు.
గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ.. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులైన వారికి అందించడంతోపాటు భూ సమస్యల పరిషారంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. వీఆర్వోల వ్యవస్థను పునరుద్ధరించి, రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.