తెలంగాణ చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లేవి?
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాకతీయ తోరణంలో ఎలాంటి రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.
- మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఏమున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసనమండలిలో గురువారం తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాకతీయ తోరణంలో ఎలాంటి రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. భూమి, నీటిని తల్లితో పోలుస్తామని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఓ ప్రొఫెసర్ తెలంగాణ తల్లి ప్రతిమను రూపొందించారని తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఓ సామాజిక వర్గ దొరసాని గుర్తుకు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. కాకతీయ రాజులు తెలంగాణ సమాజానికి ఎంతో మేలు చేశారని, నిజాం రాజులు హైదరాబాద్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని దేశపతి వివరించారు. రాజీవ్‌గాంధీ దేశం కోసం చేసిన సేవలపై గౌరవం ఉన్నదని, జాతీయ నాయకుల పేర్లు పలుచోట్ల పెట్టుకున్నామని, ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌కి రాజీవ్‌గాంధీ పేరు పెట్టుకున్నామని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని హితవు పలికారు. అనంతరం సభ్యుల అభ్యంతరాలపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. కాకతీయ తోరణం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తామని తెలిపారు. ప్రభుత్వమే విగ్రహం తయారు చేయదని, అన్నివర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. విగ్రమం, చిహ్నం తయారీలో బీఆర్ఎస్ నేతల సలహాలు తీసుకుంటామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

