శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ నామినేషన్
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
హైదరాబాద్: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. బండ ప్రకాశ్ వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసుధానాచారి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.
మండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసయనున్నారు. అనంతరం బాధ్యతలు అప్పగిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

