హైదరాబాద్ డిసెంబర్ 12: ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సనత్‌నగర్(Sanathnagar) ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్(MLA Talasani అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలందరికి అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో హౌసింగ్ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, రేణుకా నగర్‌కు చెందిన కమిటీ ప్రతినిధులు, అలాగే వెస్ట్ మారేడ్‌పల్లిలోని బ్రహ్మకుమారీలు, బన్సీలాల్‌పేట్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కాగా, ఈ నెల 30న గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే 10 స్టేట్ మీట్‌కు హాజరు కావాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు నిర్వహాకులు ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ లైఫ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్, సీనియర్ వైస్ ప్రసిడెంట్ ఆర్పి భగవాన్, రత్నకుమార్, లక్ష్మి ఎమ్మెల్యేకు ఆహ్వానం పలికారు.