కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సీతక్క సంచలన వ్యాఖ్యలు
MLA Seetakka | భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న వెంకట్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. వెంకట్ రెడ్డి ఓ దుర్మార్గుడు
నల్లగొండ : భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌పై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న వెంకట్ రెడ్డిపై ఆమె నిప్పులు చెరిగారు. వెంకట్ రెడ్డి ఓ దుర్మార్గుడు అని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేయడం ఎంత వరకు సరైనది అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు. బంధాలకతీతమే రాజకీయాలు.. నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే.. పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. తమ్ముడి గెలుపే ముఖ్యమైతే.. కాంగ్రెస్ కండువాను తీసి పక్కనపెట్టి, బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని సీతక్క నిలదీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

