హైదరాబాద్ : జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి గాను నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు (MP Deevakonda Damodar Rao) కు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(Mla Sanjay kumar) ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ నిధుల (MP Funds) నుంచి నిధులు మంజూరు చేసి నియోజక వర్గం అభివృద్ధికి సహకరించినందుకు గురువారం ఎంపీ నివాసంలో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీ , ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్‌కుమార్‌ను సైతం ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు.