MLA Sanjay Kumar | దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
MLA Sanjay Kumar | దివ్యాగుల(Disabled) సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, దివ్యాంగుల కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్‌ను అందజేశారని జగిత్యాల (Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాల పట్టణం వివేకానంద మినీ స్టేడియంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం, క్రీడా పోటీలు నిర్వహించారు.
జగిత్యాల : దివ్యాగుల(Disabled) సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, దివ్యాంగుల కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్‌ను అందజేశారని జగిత్యాల (Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. జగిత్యాల పట్టణం వివేకానంద మినీ స్టేడియంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానకి హాజరైన ఎమ్మెల్యే క్రీడల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు బహుమతుల ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కుటుంబంలో మానసిక, అంగవైకల్యం ఉంటే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.2 లక్షల వరకు లోను ఇస్తుందని తెలిపారు. ప్రతి పక్షంలో ఉన్నా ప్రజల పక్షాన, దివ్యాంగుల పక్షాన పోరాడుతామన్నారు. సదరం క్యాంప్ ఏర్పాటు చేసి ధృవ పత్రాలు లేని వారికి ఇప్పించే భాధ్యత తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత, సంక్షేమ అధికారి నర్సయ్య, స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, రోటరీ క్లబ్ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

