బండి సంజయ్‌కు దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలి.. పైలట్ రోహిత్ రెడ్డి సవాల్
MLA Pilot Rohith Reddy | రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే రేపు ఉదయం 10 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే రేపు ఉదయం 10 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఈడీ, సీబీఐ దాడులకు భయపడం అని రోహిత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇవాళ ఉదయం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈడీ నోటీసులు చూసి లాయర్లే ఆశ్చర్యపోతున్నారు. ఈడీ నోటీసుల్లో తన వ్యక్తిగత బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. తన బయోడేటా పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది. దానికి నోటీసులు ఇవ్వాలా? అని అడిగారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈడీ నోటీసులపై న్యాయపోరాటం చేస్తాం. తప్పుడు ఆరోపణలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందని రోహిత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

