Lasya Nanditha | డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం.. సంగారెడ్డి ఏఎస్సీ వెల్లడి
Lasya Nanditha | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది.
Lasya Nanditha | సంగారెడ్డి : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాద ఘటనపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె పీఏ ఆకాశ్(24) ఉన్నాడు. సదాశివపేటలోని దర్గాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లాస్య నందిత తన ఇంటి నుంచి శుక్రవారం తెల్లవారుజామున బయల్దేరారు. తెల్లవారుజామున 4:58 గంటల సమయంలో శామీర్‌పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించారు. సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత బతికే ఉన్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. పీఏ ఆకాశ్ ఎడమకాలు విరిగిపోయింది. అతను శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదమే అని పోలీసులు తేల్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

