BC Reservations | హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై రణభేరి మోగించారు. ఈ విషయాల్లో గత కొన్నాళ్లుగా బీసీల్లో చైతన్యం తీసుకొస్తున్న ఆమె.. శుక్రవారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున బీసీ మహాసభ నిర్వహణకు ముందుకొచ్చారు. ప్రముఖ సంంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతిని పురసరించుకొని ఇందిరాపారు వద్ద ఈ బీసీ మహాసభ నిర్వహించనున్నారు.
కవిత పిలుపు మేరకు ఇప్పటికే వివిధ బీసీ, ప్రజాసంఘాలు మహాసభకు సంఘీభావం ప్రకటించాయి. తాజాగా గురువారం మరో రెండు సంఘాలైన విద్యార్థి జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన బీసీ మహాసభ కార్యక్రమానికి గురువారం సాయంత్రం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంపై బీసీ సంఘాల ప్రతినిధుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.
సావిత్రీబాయి జయంతి సందర్భంగా బీసీల కార్యక్రమంపై ఆంక్షలా? అని మండిపడ్డాయి. అందుబాటు లో ఉన్న బీసీ సంఘాల నేతలు ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకొని కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాసే దుస్థితిపై కవిత ఆగ్రహం వ్యక్తంచేశా రు. హైదరాబాద్ సీపీతో ఆమె ఫోన్‌లోమాట్లాడారు. ఆమె విజ్ఞప్తికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్ వద్ద జరిగే సభకు ఎట్టకేలకు అనుమతించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వెన్నుపో టు పొడిచిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేదాకా తమ పోరా టం కొనసాగిస్తామని కవిత ప్రతినబూనారు. శు క్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరా పా రు వద్ద ప్రారంభమయ్యే ఈ బీసీ మహాసభకు పెద్ద ఎత్తున రావాలని కవిత పిలుపునిచ్చారు.
ఇందిరాపార్ వద్ద ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో జరిగే బీసీ మహాసభకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ అంబేదర్ యువజన సం ఘం, ఓయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు గురువారం తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం కవిత చేస్తున్న పోరాటంలో భాగస్వాములం అవుతామని వెల్లడించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీగా తరలివస్తామని తెలిపారు. పూసల సంఘం తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కోనేరు సురేశ్‌కుమార్ కూడా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకపోగా, బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్వీ నేత అప్పల శేఖర్ యాదవ్ మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సారథ్యంలో నిర్వహిస్తున్న బీసీ మహాసభ పోస్టర్‌ను కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మిషన్ భగీరథ మాజీ వైఎస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దశరథ్‌నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ నిర్మలా శ్రీశైలంగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గంప వెంకటేశ్, తెలంగాణ ఆరెకటిక సంఘం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్‌కార్ జాంగిర్, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షుడు సంపంగి శ్రీశైలం, నాయకులు కల్యాణ్‌కార్ శంకర్, అండేకార్ సాయి తదితరులు పాల్గొన్నారు.
ఏడాది పాలనలో కాంగ్రె ప్రభు త్వం బీసీలకు ఏం చేసిందో చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొన్పునూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఏటా బీసీ సబ్‌ప్లాన్ కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్.. బడ్జెట్లో కేవలం రూ.150 కోట్లే కేటాయించిందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.