Akbaruddin Owaisi | ఒక్కటి కూల్చేస్తే వంద నిర్మిస్తాం.. మీ బెదిరింపులకు భయపడం.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
Akbaruddin Owaisi | ఒక్క విద్యాసంస్థను కూల్చేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని చాంద్రాయణగుట్ట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akbaruddin Owaisi |చాంద్రాయణగుట్ట, జూలై 5 : ఒక్క విద్యాసంస్థను కూల్చేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తామని చాంద్రాయణగుట్ట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్ గౌస్నగర్లోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫాతిమా కళాశాల అంశంపై మమ్ములను భయపెట్టాలని చూస్తున్నారు. మేం అవినీతికి పాల్పడలేదు. మీ బెదిరింపులకు తలొగ్గేది లేదు. మా విద్యాసంస్థలను కూల్చివేస్తామంటున్నరు. ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఒక్కటి కూల్చేస్తే వంద విద్యాసంస్థలు నిర్మిస్తాం. విద్యాసంస్థలున్నా, లేకపోయినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తా’మని పేర్కొన్నారు. సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ హోదాలో రూ.కోటీ 19లక్షలను 366మంది పేద విద్యార్థుల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, వొకేషనల్ కోర్సుల సర్టిఫికెట్లు అందజేశారు.
ఫాతిమా కళాశాలపై వివాదం
సల్కం చెరువు స్థలంలో ఫాతిమా ఒవైసీ కళాశాలను నిర్మించినట్టు హైడ్రా అధికారులు గుర్తించడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ, చెరువు హద్దులుపై కోర్టు నివేదిక కోరింది. మూడు నెలల గడువు ఇచ్చినా వివరాలు ఇవ్వలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రభుత్వ భూములపై వారం రోజుల వ్యవధిలో పూర్తి నివేదిక దాఖలు చేయాలని కోర్టు ఆదేశించడంతో సల్కం చెరువు అంశంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

