రాంచీ, డిసెంబర్ 1: పదిహేనేండ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న ముస్లిం యువతులు తమకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే స్వేచ్ఛ ఉన్నదని జార్ఖండ్ హైకోర్టు తెలిపింది. ఓ ముస్లిం యువకుడు తమ సామాజిక వర్గానికి చెందిన 15 ఏండ్ల వయసున్న యువతిని పెండ్లి చేసుకున్నాడు. దీంతో ఆ యువతి తండ్రి యువకుడిపై కేసు పెట్టాడు. ఈ కేసును సవాల్ చేస్తూ ఆ యువకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ‘ముస్లిం పర్సనల్ లా’ ప్రకారం 15 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న ముస్లిం యువతులు తమకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకునే స్వేచ్ఛ ఉన్నదని, ఈ పెండ్లికి తల్లిదండ్రుల అంగీకారం అవసరం లేదని వెల్లడించింది.