నిర్మల్ : జిల్లా కేంద్రంలో అధునాతన వసతులతో నిర్మించిన నూతన అంబేద్కర్ భవన్ ను ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎకరం విస్తీర్ణంలో రూ. 5 కోట్ల వ్యయంతో విశాలమైన భవనాన్ని నిర్మించారు. సుమారు 2 వేల మంది కూర్చునేలా ఆడిటోరియాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిర్మల్‌లో నిర్మించిన అంబేద్కర్ భవనం తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్‌గా నిలవనుంది.