Minister Vemula | రాజబహదూర్ వెంకటరామరెడ్డి సేవలు ప్రశంసనీయం : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
Minister Vemula | రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు.
నిజామాబాద్ : రాజబహదూర్ వెంటకరామరెడ్డి సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashant Reddy) అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీవీఆర్ఆర్ కాంస్య విగ్రహాన్ని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా (Mla Ganesh Gupta)తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యతోనే వికాసం, అభివృద్ధి సాధ్యమని గుర్తించి 80 ఏండ్ల క్రితమే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రెడ్డి హాస్టళ్లు (Hostels), విద్యా సంస్థలు( Educational Institutes) నెలకొల్పారన్నారు. రెడ్డి కులస్తుల అభ్యున్నతి కోసం రాజ బహదూర్ వెంకట రామరెడ్డి అందించిన సేవలు ఎంత ప్రశంసించిన తక్కువేనని కొనియాడారు. విద్యవ్యాప్తికి కృషి చేసిన ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రెడ్డి హాస్టళ్లు, విద్యా సంస్థల కోసం మునుపెన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్(CM KCR) హైదరాబాద్‌లో 15 ఎకరాల స్థలం, రూ. 10 కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఆర్బీవీఆర్ఆర్ సేవలకు జ్ఞాపకార్థంగా ఆయన జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ఈగ సంజీవ్‌రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ ఉమారాణి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

