హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): ప్రాథమి క సహకార సం ఘాలను మరిం త బలోపేతం చేసి, రైతులకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవా రం రాష్ట్ర సచివాలయంలో కోఆపరేటివ్, మార్కెటింగ్ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాల్లో రైతులకు సులభతరంగా, సమర్థవంతంగా సేవలు అందేలా రీ-ఆర్గనైజేషన్ చేయాలని తెలిపారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లలో జరిగిన అవకతవకలపై విచారణ పూర్తి చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి జిల్లాకు ఒక మోడల్ మారెట్ ఏ ర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. మారెట్, జిన్నింగ్ మిల్లులకు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని, అధికారులు, సెక్రటరీలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
వాట్సాప్ నంబర్ 88972 81111 ద్వారా వెయిటింగ్ టైమ్, పేమెంట్ స్టేటస్, ఫిర్యాదుల ఫోరం, ఇతర సేవలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో అగ్రికల్చర్ మారెటింగ్ డైరెక్టర్, డైరెక్టర్ కో ఆపరేటివ్ ఉదయ్‌కుమార్, అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగును మరింతగా పెంచేందుకు అధికారులు కృషి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సూచించారు. ఆయి ల్ ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా, జీఎం సుధాకర్‌రెడ్డితో మంత్రి శుక్రవారం భేటీ అయ్యారు. గెలల ధర టన్నుకు రూ. 19,144కు చేరడంపై ఆయిల్ ఫెడ్ సిబ్బందిని అభినందించారు. మలేసియా పద్ధతులను పాటిస్తూ, పామ్ ఆయిల్ రైతుల వృద్ధికి తోడ్పడాలని మంత్రి సూచించారు.