ఉద్యమానికి దాశరథి స్ఫూర్తి

- దాశరథి ఖ్యాతిపై షార్ట్ ఫిల్మ్ పోటీల నిర్వహణ
- పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఎల్లూరు శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు ప్రదానం
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ రవీంద్రభారతి: తెలంగాణ ఉద్యమానికి దాశరథి కృష్ణమాచార్య స్ఫూర్తి అని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆయన సాహిత్యమే కవులను, కళాకారులను తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించేలా చేసిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమ మూలాలు దాశరథి సాహిత్యంలో ఉన్నాయని తెలిపారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి స్ఫూర్తితోనే.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని 2021 సంవత్సరానికి తెలుగు వర్సిటీ మాజీ వీసీ, సాహితీవేత్త డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి గురువారం రవీంద్రభారతిలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. దాశరథి ఖ్యాతిని మరింత పెంచేలా ఆయనపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముద్దుబిడ్డ ఎల్లూరు శివారెడ్డికి అవార్డు రావడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. నాటి కవులు, రచయితలు అప్పటి గాథలను రాస్తే.. తెలంగాణ చరిత్రను తిరగరాసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ అభివృద్ధిని, రాబోయే రోజుల్లో ఎలాంటి తెలంగాణ ఉండబోతుందనే అంశాలపై ఇప్పుడున్నవారు రచనలు చేయాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
ఒక్కో పదం చింత నిప్పు: శివారెడ్డి
1984-85లో సిద్దిపేటలో కేసీఆర్ తన పుస్తకాన్ని ఆవిష్కరించారని దాశరథి అవార్డుగ్రహీత ఎల్లూరు శివారెడ్డి తెలిపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూస్తే నాకు ఎప్పుడూ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. రవీంద్రభారతి వేదికపై ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఒక పద్యం చదివారు. అప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయ అధ్యాపకులను పిలిచి ముఖ్యమంత్రి చెప్పిన పద్యం మీలోఎవరికైనా వచ్చా అని అడిగా. ఎవరూ వచ్చని చెప్పలేదు. అంతటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన దేహం నిండా విద్వత్తే. నాకు తెలిసినంత వరకు దాశరథి ఒక్కో పదం ఒక్కో చింత నిప్పులా ఉంటుంది. భావావేశం అంటే దాశరథిని చూసి నేర్చుకోవాలి. ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది’ అని శివారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ సెక్రటరీ జీ వసుంధర, దాశరథి కుమారుడు లక్ష్మణ్, దాశరథి అభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

