Neera Cafe | హైదరాబాద్‌లోని నీరా కేఫ్‌ను ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కేఫ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను, ప్రజలకు అందించే తెలంగాణ పిండి వంటకాలు, మాంసాహార వంటకాలు, నీరా ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. నీరా కేఫ్‌కు వచ్చిన వినియోగదారులను కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే కేఫ్‌లో అందిస్తున్న వంటకాలను రుచి చూశారు. నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందించాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు. ప్రకృతి, సాంప్రదాయ ఎన్నో ఔషధ గుణాలున్న నీరాపై కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యానికి, క్యాన్సర్‌తో పాటు అనేక జబ్బులను నివారించే ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నారన్నారు. ఎంతో ప్రాముఖతను కలిగిన నీరాను ప్రజలందరికి చేరేలా నీరాకేఫ్ ముఖ్య భూమిక పోషించేలా అధికారులు, స్టాల్ నిర్వాహకులు కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.