హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఈర్ష్యా, అసూయ పెరుగుతున్నాయని స్త్రీ,శిశు సంక్షేమశాఖమంత్రి సీతక్క తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య ఆధిపత్యపోరుతో గురుకుల హాస్టళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గురువారం హైదరాబాద్ సరూర్నగర్లో గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల శిక్షణలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులంతా ఒకే కుటుంబంలా ఉంటే సమస్యలు రావని చెప్పారు. ఉపాధ్యాయులతో విద్యార్థుల కాళ్లు మొకించడం వంటి ఘటనలకు కొన్ని దుష్టశక్తులే కారణమని విమర్శించారు. శిక్షణ కార్యక్రమంలో సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయాల కార్యదర్శి వర్షిణి, అధికారులు పాల్గొన్నారు.
వైరాటౌన్, జనవరి 16 : కాంగ్రెస్లో మాలల ఆధిపత్యం నడుస్తున్నద ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మందకృష ్ణమాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘వెయ్యి గొంతులు-లక్ష డప్పుల’ కార్యక్రమాన్ని విజయవం తం చేసేందుకు ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సన్నాహక సమావేశం గురువా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2024న ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణను పంజాబ్, తమిళనాడు, హర్యాన తదితర రాష్ర్టాల్లో అమలు చేసినప్పటికీ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ పార్టీలోని మాల నాయకులే కారణమని ఆరోపించారు.