బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఫీజు 40 శాతం మాఫీ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
RGKUT | ప్రభుత్వ స్కాలర్‌షిప్‌నకు అర్హతలేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40 శాతం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు
హైదరాబాద్ : ప్రభుత్వ స్కాలర్‌షిప్‌నకు అర్హతలేని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. కరోనా నేపథ్యంలో రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40 శాతం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 2018 – 19, 2019 -20 విద్యా సంవత్సరాల్లో కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు జరగక పోవడం, వసతి గృహాల నిర్వహణ లేకపోవడం వల్ల విద్యార్థులపై భారం పడకుండా ఈ మినహాయింపునిచ్చినట్లు మంత్రి తెలిపారు.
మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం విద్యార్థులకు ఊరట కల్పించిందని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా ప్రభుత్వపరంగా స్కాలర్‌షిప్‌నకు అర్హత ఉన్న విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్ అందలేదన్న కారణంతో వారి సర్టిఫికెట్లను ఇవ్వకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. స్కాలర్‌షిప్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను అడిగిన వెంటనే అందించాలని బాసర ట్రిపుల్ఐటీ వైస్‌చాన్స్‌లర్‌ను మంత్రి ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

