హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరికాసేపట్లో పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra reddy), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆల్ ది బెస్ట్ (All The Best) చెప్పారు. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని మంత్రి సబిత సూచించగా, జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
‘పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభాభినందనలు…ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయండి.. ఆల్ ది బెస్ట్’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభాభినందనలు…ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయండి.
…అల్ ది బెస్ట్👍.— SabithaReddy (@SabithaindraTRS) April 3, 2023
‘జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్’ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
జీవితంలో ఉన్నత చదువులకు తొలిమెట్టు అయిన పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్ 👍
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 3, 2023
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 76.5 శాతం మంది ఇంగ్లిష్ మీడియం వారే కావడం విశేషం. తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మీడియం విద్యార్థులు కూడా పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థుల కోసం అధికారులు 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 34,500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనున్నది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించనున్నారు. 9:35 గంటలకు గేట్లు మూసివేస్తారు.