వర్ధన్నపేట, నవంబర్ 7: త్వరలోనే ఆటమ్‌బాంబు పేలబోతున్నదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ.33 కోట్ల అభివృద్ధి పనులను స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను ఇటీవల బాంబులు పేలబోతున్నాయని చెప్తే.. కొంతమంది తుస్సు బాంబులు, అవి ఎక్కడ పేలవని మాట్లాడారని, కానీ.. త్వరలోనే లక్ష్మీబాంబులు, నాటుబాంబులు కాకుండా ఆటమ్బాంబులు పేలనున్నాయని చెప్పారు.
ప్రజాధనాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టంచేశారు. తల తాకట్టు పట్టైనా డిసెంబర్ 31లోగా పంట రుణాలన్నీ మాఫీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు.