వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి లావణ్య కుటుంబాన్ని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. సమస్యలు ఉంటే పక్కవారితో పంచుకోవాలి తప్ప మనసులో పెట్టుకుని బాధపడొద్దన్నారు. లావణ్య సోదరుడు భరత్పై చదువుకు సాయం అందిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని లావణ్య కుటుంబ సభ్యులకు మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి లావణ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyTRS గారు pic.twitter.com/UjF10vzIT5
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) July 23, 2021