పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది: మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
వనపర్తి: పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. పల్లెలు
ఒకప్పుడు తాగునీటి కోసం తండ్లాడేవని, మిషన్ భగీరథతో నేడు ఆ సమస్య పూర్తిగా సమసి పోయిందన్నారు. పల్లెనిద్రలో భాగంగా వనపర్తి జిల్లా నాగసానిపల్లిలో గురువారం ఉదయం ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రాకతో గ్రామాల నుంచి వలసలు తగ్గాయన్నారు. ఒకనాడు వలసెల్లిన కుటుంబాలు వెనక్కి వచ్చాయని చెప్పారు. బీడుభూములు సస్యశ్యామలమయ్యాయని, పంట రాశులతో పల్లెలు కళకళలాడుతున్నాయని తెలిపారు.
మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు బాగయ్యాయని, పల్లెప్రగతితో గ్రామాలు పరిశుభ్రమయ్యాయని చెప్పారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మాణంతో పల్లెలకు కొత్త శోభ వచ్చిందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీళ్ల ట్యాంక్ కేటాయింపుతో చెత్త సేకరణ, చెట్ల పెంపకానికి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపు ఫలితంగానే ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇలాంటి పథకాలు అమలుకావడం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

