వనపర్తి : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పంద్రాగస్టు రోజున స్థానిక కలెక్టర్, ఎస్పీకి చేనేత చీరెలు బహుమతిగా అందజేసి వారిని సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తారు. వివరాల్లోకి వెళ్తే..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి జిల్లా కేంద్రంలోని చేనేత స్టాళ్లను సందర్శించారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు ఉన్నారు. కాగా, చీరెలను చూసిన మంత్రి తనకు రెండు మంచి చీరలు కావాలని స్టాల్ నిర్వాహకులకు సూచించారు.
అలాగే చీరెలను సెలెక్ట్ చేయాలని కలెక్టర్, ఎస్పీలను కోరగా.. వారు తమకు నచ్చిన సారీస్ సెలెక్ట్ చేశారు. ఇంకేముంది మంత్రి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చీరెలు బహుమతి ఇస్తున్నట్లు వారిద్దరికి చెప్పి అక్కడే అందజేశారు. ఉహించని పరిణామానికి కలెక్టర్, ఎస్పీ తబ్బుబ్బిపోయారు. ఎంతో సంతోషంగా చీరెలను తీసుకుని మంత్రికి ధన్యవాదాలులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా తీజ్ ఉత్సవాలు..ఆడిపాడిన మంత్రి సత్యవతి రాథోడ్
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
జహీరాబాద్‌లో 74 కిలోల గంజాయి పట్టివేత
Heart Attack : సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన