అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనం : మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు – రిజిస్టర్ కులసంఘాల నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం భవనాలకు అనుమతి పత్రాలను మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్, బసవరాజు సారయ్య, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అదనపు సంచాలకులు మల్లయ్య భట్టు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ తెలంగాణ ప్రబలమైన మార్పులు వస్తున్నాయన్నారు.
మార్పును చూడలేనివారు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుబంధు అర్హులు 65లక్షల మంది ఉన్నారని, ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 8.54లక్షల మంది, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రైతులు 8.24లక్షలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు 37.5లక్షల మంది ఉన్నారని తెలిపారు. రైతుబంధు విషయంలో కొందరు అర్థం లేదని వాదన చేస్తున్నారని, రాష్ట్రంలో 1.50కోట్ల సాగు యోగ్యమైన భూమి ఉన్నదన్నారు.
ఇందులో 92.5శాతం భూమి ఐదెకరాల్లోపు రైతు చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది సన్న, చిన్నకారు రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలేనన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధితో తెలంగాణలో ఒక్కో సామాజికవర్గం క్రమంగా బలపడుతున్నదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువెళ్లినా పాడిపంటలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. ప్రతి ఏటా ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయన్నారు. కేంద్రం కొత్త ఉద్యోగాలు సృష్టించడం వదిలేయడంతో పాటు ఖాళీగా ఉన్న 14.50 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఫలితంగా నష్టపోతున్న వర్గాలపై సమాజంలో చర్చజరగాల్సిన అవసరం ఉదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రేవంత్ కూతురు కార్పొరేట్ స్కూల్స్.. పొంగులేటి కూతురేమో ఇంటర్నేషనల్ స్కూల్స్ : మన్నె క్రిశాంక్
Spurious Liquor | మణిపూర్ కల్తీ మద్యం దుర్ఘటన.. 13కు పెరిగిన మృతుల సంఖ్య.. ఆస్పత్రుల్లో 300 మంది..!
రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు విద్యార్థి సి.హెచ్.లోహిత్ ఎంపిక
శ్రీనివాస గిరిపై సామూహిక వ్రతాలు
woman pawns mangalsutra | మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను హత్య చేసిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

