వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ వందేళ్ల ప్రణాళికతో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా సచివాలయం(Secretariat) నిర్మాణం, జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు(Irrigation projects), విద్యుత్ ప్రాజెక్టులు, వైద్య, విశ్వ విద్యాలయాలు నిర్మిస్తున్నారని ప్రశంసించారు. ‘పోలీసులు నిష్పక్షపాతంగా న్యాయం వైపు నిలబడి పనిచేయాలి. నూతన కార్యాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని’ సూచించారు.
వనపర్తిలో 250 ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు ఒకచోటే ఏర్పాటయ్యాయని వెల్లడించారు. మెడికల్ కళాశాల(Medical College)ను చూసి వైద్య విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. నూతన కార్యాలయం సందర్భంగా కార్యాలయంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమర్, ఎస్పీ, రిజిస్ట్రర్‌లో సంతకాలు పెట్టారు. ఈ సందర్భగా ఎస్పీని డీజీపీ అభినందించారు.