హైదరాబాద్ : రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Minister Mahender Reddy) రేపు ( బుధవారం) పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈనెల 24 న రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం బీఆర్ అంబేద్కర్ (Ambedkar Bhavan) తెలంగాణ సచివాలయంలోని మొదటి అంతస్తు లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
కాగా మంత్రి పి. మహేందర్ రెడ్డి ని మంగళవారం సమాచార శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలసి సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో సమాచార శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లీ, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధుసూదన్, రాజా రెడ్డి, సీఐఈ రాధ కిషన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు తదితరులున్నారు.