Hanumakonda | హనుమకొండ : ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రూ. 66 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్( MLA Dasyam Vinay Bhasker ) గురువారం వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) కార్యాలయాన్ని కూడా కేటీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల అనంతరం కుడా గ్రౌండ్స్( KUDA Grounds )లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )ను విచారణ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఒక వేళ కవితను ఈడీ( ED ) అరెస్టు చేస్తే భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.