వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురుస్తోంది. సోమవారం ఉదయం నుంచి పొడి వాతావరణమే ఉన్నా.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారి ఆకాశం మేఘవృతమైంది. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.