హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్తిని ఇస్తున్నది.
ఈ ఉత్తేజకరమైన జర్నీలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ చరిత్రాత్మకమైన రోజున తెలంగాణను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదాం’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.