మహబూబాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, ఆదివారం లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి సత్యవతిని ఓదార్చారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.