హైదరాబాద్: అసలు హైదరాబాద్ అంటే ఎలా ఉంటుందో వినిపించాడు ర్యాప్ స్టార్ కేడన్ శర్మ(Kayden Sharma). స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్‌తో ఈ హ్యాపెనింగ్ సిటీకి అతనో స్పెషల్ వాయిస్‌గా నిలిచాడు. ఎంటీవీ మ్యూజిక్ షోలో కేడన్ పాడిన పాట.. ఇంటర్నెట్లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఆ పాటకు ఫిదా అవ్వని వ్యక్తంటూ ఎవరూ లేరు. హైదరాబాద్ నగరానికి చెందిన కేడన్ శర్మ.. ఎంటీవీ మ్యూజిక్ షోలో పాడిన స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్ ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. లోకల్ ఫ్లేవర్‌తో కూడిన విషయాలను.. అతను హిప్ హాప్ స్టయిల్లో పాడిన తీరు అందర్నీ స్టన్ చేస్తోంది. ఇక మంత్రి కేటీఆర్ కూడా కేడన్ ట్యాలెంట్‌కు ముగ్ధుడయ్యారు. ఓల్డ్ సిటీ కే స్లాంగ్ లేకే ఆయా ఎంటీవీ అంటూ కేడన్ తన ర్యాప్ స్వరంతో హోరెత్తించాడు.
మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో కేడన్ శర్మ సాంగ్‌పై రియాక్ట్ అయ్యారు. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్‌కు ఇప్పుడు స్ట్రీట్ సెలబ్రిటీ ఓ షాన్‌గా మారాడని తన ట్వీట్లో తెలిపారు. కేడన్ పాడిన స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్‌ను ఎంతో ప్రేమిస్తున్నట్లు చెప్పారు. రాప్ స్టార్ కేడన్ తన కెరీర్లో మరింత సక్సెస్ కావాలని కోరుతూ చప్పట్లు కొట్టే ఎమోజీని ఆయన పోస్టు చేశారు.
Street celebrity ab ban gaya #HappeningHyderabad ki Shaan!
Love this! Kayden Sharma. Wish you great success 👏👏
https://t.co/iwZo8C97zF— KTR (@KTRBRS) October 26, 2023
హైదరాబాద్‌కు ప్రత్యేకమైన బిర్యానీ, ఛాయ్‌ల గురించి కేడన్ తన సాంగ్‌లో చాలా జోష్‌ఫుల్‌గా పాడాడు. కేడన్ పాడిన స్టయిల్.. ఎంటీవీ జడ్జిలను కూడా ఇంప్రెస్ చేసింది. బిర్యానీ కే నామ్‌పై సబ్ ఖాతా హై పులావ్.. అసల్ బిర్యానీ ఖానా కే హైతో హైదరాబాద్ ఆవో అంటూ కేక పుట్టించాడు కేడన్. ఆతే ఆతే సఫర్ మే దర్ద్ హువాతే.. హిరానీ కే ఛాయ్ పీవో అంటూ కూడా పంచ్ ఇచ్చాడు తన సాంగ్‌లో. సముందర్ నహే లేకిన సీఫుడ్‌కే మిల్తా అంటూ హైదరాబాద్ కీర్తిని ర్యాప్ స్టయిల్లో పొగిడాడు. చార్మినార్ కా పాస్ హర్ షాప్మే బోల్తా.. హల్లో మేడమ్ ఇదర్ మిల్తా డిస్కౌంట్ అంటూ ఓల్డ్ సిటీ బిజినెస్ స్టయిల్‌ను సాంగ్‌లో ప్రజెంట్ చేశాడు.
సప్నోంకా షెహర్ నహీ.. హకీకత్ కా షెహర్ హై అంటూ హైదరాబాదీల పోరాట స్పూర్తిని తన పాటలో వినిపించాడు. కేడన్కా ఫ్యాన్ మిల్తా హర్ దూస్రీ గల్లీమే అంటూ తన అభిమానుల గురించి స్పెషల్ మెన్షన్ చేశాడు ఆ సాంగ్‌లో. రామోజీ ఫిల్మ్ సిటీమే బన్తీహై బ్లాక్‌బస్టర్ ఫిల్మ్.. తుమ్ కిత్నేబీ బడా కా బేటా హో.. ఇదర్ కోహీ జుక్తే నహీ.. సబ్ పుష్పాకా ఫ్యాన్స్ అంటూ కేడన్ తన ర్యాప్ పంచ్‌లతో ఆ సాంగ్‌లో ఇరగదీశాడు. హైదరాబాద్‌కు ఆనేవాలే అంగ్రేజీ బోల్తే.. ఓ మైగాడ్ ఇట్స్ఏ బ్యూటిఫుల్ సిటీ అంటారని కేడన్ తన సాంగ్‌తో జోష్ నింపాడు.