Multi Grains | మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిలో చపాతీలు కూడా ఒకటి. వీటిని మనం గోధుమపిండితో తయారు చేస్తూ ఉంటాం. అధిక బరువుతో బాధపడే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. గోధుమలతో చేసే చపాతీలు రుచిగా ఉన్నప్పటికీ వీటిని తీసుకోవడం వల్ల అంత వేగంగా బరువు తగ్గకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోధుమలకు బదులుగా ఇప్పుడు చెప్పే ధాన్యాలతో రొట్టెలను చేసుకుని తినడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు. గోధుమలకు బదులుగా తీసుకోదగిన ఇతర ధాన్యాల గురించి వారు వివరిస్తున్నారు.
గోధుమలకు బదులుగా జొన్నలతో చేసిన రొట్టెలను తినడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. జొన్నలలో గ్లూటెన్ ఉండదు. అంతేకాకుండా ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో రొట్టెలను చేసి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి అవకుండా ఉంటుంది. జొన్నలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సజ్జలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. సజ్జలతో రొట్టెలను చేసి తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా తీరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
క్యాల్షియం ఎక్కువగా ఉండే రాగులను కూడా మనం గోధుమలకు ప్రత్యమ్నాయంగా తీసుకోవచ్చు. రాగులను తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణంలో ఉంటుంది. బరువు సులభంగా తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా రాజ్ గిర ధాన్యాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని అమరాంత్, తోటకూర గింజలు అని కూడా అంటారు. వీటిలో ఉండే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు కండరాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఈ ధాన్యంతో రోటీలు చేసి తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవడంతోపాటు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా త్వరగా కరుగుతుంది. అదేవిధంగా గోధుమలకు బదులుగా బార్లీతో కూడా రొట్టెలను తయారు చేసి తీసుకోవచ్చు. బార్లీతో చేసిన రొట్టెలను తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. నడుము చుట్టూ ఉండే కొవ్వు త్వరగా కరుగుతుంది.
ఇక కినోవా ధాన్యాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్ లు తక్కువగా ఉంటాయి. ఈ ధాన్యాన్ని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. వేగంగా బరువును తగ్గించే కుట్టు ధాన్యాన్ని కూడా గోధుమలకు బదులుగా తీసుకోవచ్చు. ఇవి గ్లూటెన్ రహిత ధాన్యం. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ స్థాయిలు పెరుగుతాయి. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. చివరగా మొక్కజొన్నలతో చేసిన రొట్టెలను కూడా గోధుమలకు ప్రత్యమ్నాయంగా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా తరచూ గోధుమలనే కాకుండా వాటికి బదులుగా పైన చెప్పిన తెలిపిన ధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.